ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: 40 వేల కోట్ల భారం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ABN, Publish Date - Jun 16 , 2024 | 03:58 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా...? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు.

Jeevan Reddy

జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా...? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డారని మండిపడ్డారు. లేదంటే సోలార్ గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. గత పదేళ్ల హయాంలో కేసీఆర్ చేయని తప్పు లేదని.. ఇవే తప్పులు చైనాలో చేసి ఉంటే ఉరి తీసేవారని విమర్శించారు.


వివిధ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆలోచిన తప్పయ్యిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.. దాంతో రూ.40 వేల కోట్ల ఆర్థిక భారం పడిందని వివరించారు. దొంగే.. పోలీసులను బెదిరించినట్టు కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఏకపక్షంగా వాదిస్తున్నారని గుర్తుచేశారు. నరహింహా రెడ్డి నివేదిక ఏం ఇస్తారోననే భయం కేసీఆర్‌లో నెలకొందని పేర్కొన్నారు. అందుకే ఏకపక్షంగా వాదిస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి కేసీఆర్‌కు తెలుసు అన్నారు. ఆ విషయంలో అరెస్ట్ అవుతానని కేసీఆర్ ముందే ఊహించారని.. అందుకే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:

GHMC: జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేతతో చర్యలు

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్

Updated Date - Jun 16 , 2024 | 04:01 PM

Advertising
Advertising