ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

ABN, Publish Date - Aug 12 , 2024 | 10:56 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ కవిత పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న తీహార్ జైల్లో సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు.


ఇరుపక్షాల సుధీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కి హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు.


ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని... అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరుఫు సీనియర్ న్యాయవాదులు వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని... వాటిని పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వాలన్నారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయన్నారు. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని వాటి కింద కవితకు బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారంటూ దర్యాప్తు సంస్థలు వాదించగా.. దానితో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది.

Updated Date - Aug 12 , 2024 | 10:56 AM

Advertising
Advertising
<