ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mohan Babu: సినిమాల్లోనే నటన.. జీవితంలో రాదు

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:58 AM

మీడియా ప్రతినిధులపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని.. మీడియా ముసుగులో ప్రత్యర్థులు తనపై దాడి చేసే అవకాశముంది కాబట్టే ఆ విధంగా ప్రవర్తించానని నటుడు మోహన్‌బాబు అన్నారు.

  • మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలే

  • రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు

  • మైక్‌ నా కంటికి తగిలింది.. అందువల్లే

  • లాక్కుని కొట్టా: మోహన్‌బాబు

  • ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ/పహాడిషరీఫ్‌ డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మీడియా ప్రతినిధులపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని.. మీడియా ముసుగులో ప్రత్యర్థులు తనపై దాడి చేసే అవకాశముంది కాబట్టే ఆ విధంగా ప్రవర్తించానని నటుడు మోహన్‌బాబు అన్నారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటన గురించి గురువారం ఆయన ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. సినిమాల్లో నటిస్తాను తప్ప నిజజీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి, కొట్టి ఉంటే నాపై 100 కేసులు పెట్టుకోవచ్చు. నన్ను అరెస్టు చేసుకోవచ్చు. నేనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అరెస్ట్‌ అయ్యేవాడిని. కానీ, నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు్‌్‌ అని ఆయన ఆ సందేశంలో పేర్కొన్నారు. తన కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి చూపుతున్నారని.. రాత్రివేళ తన ఇంట్లోకి వచ్చి తనకు మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ుూరాత్రి సమయంలో నా ఇంట్లోకి దూసుకొచ్చి మైకులు పెట్టారు. మైక్‌ నా కంటికి తగిలింది.


నా కన్ను పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి చీకట్లో మైక్‌ లాక్కుని ప్రతిదాడి చేశా్‌్‌ అని మోహన్‌ బాబు వివరణ ఇచ్చారు. నాలుగు రోజుల నుంచి మీడియా తన ఇంటి ముందు ఉందని.. అలా ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ుూనా పిల్లలతో ఉన్న సమస్యను నేనే పరిష్కరించుకుంటానని మీడియాకు చెప్పా. నేను ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో దండం పెట్టి మరీ ఈ విషయం చెప్పాను. నా గురించి కల్పిత కథలు ప్రచారం చేసినందుకు నేనేం బాధపడట్లేదు. నా ఇంట్లోకి దూసుకొచ్చే వాళ్లు మీడియా వాళ్లా? ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. మీడియాను కొట్టాలని దైవసాక్షిగా నేను అనుకోలేదు. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. అందుకు నేను బాధపడుతున్నా. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడిలాంటివాడు. అతడి భార్యాబిడ్డల గురించి ఆలోచించాను. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు్‌్‌ అని మోహన్‌బాబు అన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని.. అవన్నీ మరచిపోయి తాను మీడియా ప్రతినిధినికొట్టిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారని వాపోయారు. ుూనేను కొట్టడం తప్పే. కానీ, ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి.


మీకు టీవీలు ఉండొచ్చు. నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే. అసత్యం కాదు. నా విషయంలో మీడియా చూపిస్తోంది తప్పని ఎవరూ అనట్లేదు. పైన భగవంతుడు చూస్తున్నాడు.్‌్‌ అని మోహన్‌బాబు అన్నారు. ుూనేను చేసింది న్యాయమా? అన్యాయమా? ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని రావడం న్యాయమా?్‌్‌ అని ప్రశ్నించారు. తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొడుతున్నాడంటూ ఆవేదన వెలిబుచ్చిన మోహన్‌బాబు.. తాము కూర్చుని మాట్లాడుకుంటామని, కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా.. జర్నలిస్టు మీద దాడి చేసిన మోహన్‌బాబుపై పహాడిషరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తొలుత బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 118 కింద దాడి కేసు నమోదు చేశారు. న్యాయసలహా తీసుకున్న అనంతరం దాన్ని హత్యాయత్నం కేసుగా మార్చారు. ఇక.. జర్నలి్‌స్టపై దాడి ఘటన అనంతరం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబును వైద్యులు గురువారం డిశ్చార్జ్‌ చేశారు.

Updated Date - Dec 13 , 2024 | 02:58 AM