ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dengue Fever: డెంగీ లక్షణాలతో బాలింత, పసికందు మృతి

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:07 AM

డెంగీ లక్షణాలతో నవజాత శిశువుతోపాటు ఓ బాలింత మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జరిగింది.

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 14: డెంగీ లక్షణాలతో నవజాత శిశువుతోపాటు ఓ బాలింత మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో జరిగింది. గ్రామంలోని తాళ్లపల్లి శిరీష- చంద్రం దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. శిరీష మూడోసారి గర్భం దాచ్చింది. 4 రోజుల క్రితం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


ఆమెకు తీవ్రమైన జ్వరం ఉందని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. ఆమెను సిద్దిపేటలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శిరీషకు డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఆమెకు శస్త్రచికిత్స చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితి విషమించి తల్లీబిడ్డలు మరణించారు.

Updated Date - Aug 15 , 2024 | 03:07 AM

Advertising
Advertising
<