ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Monkey: కోతైనా.. అమ్మ కదా..!!

ABN, Publish Date - Nov 04 , 2024 | 04:22 AM

కోతి అనగానే ఆ మూగ జీవి చేసే అల్లరే ఎవరికైనా గుర్తుకు వస్తుంది. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న కోతిని చూశారా.. తన పిల్ల మృతదేహం వద్ద ఎంత దీనంగా కూర్చొని ఉందో..

  • పిల్ల మృతితో తల్లి కోతి మూగ రోదన

భూదాన్‌పోచంపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కోతి అనగానే ఆ మూగ జీవి చేసే అల్లరే ఎవరికైనా గుర్తుకు వస్తుంది. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న కోతిని చూశారా.. తన పిల్ల మృతదేహం వద్ద ఎంత దీనంగా కూర్చొని ఉందో.. కోతైనా.. అది కూడా ఓ అమ్మ కదా మరి.. కోతుల గుంపు రహదారి దాటుతుండగా గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొని ఆ పిల్ల కోతి మరణించింది. దీంతో తల్లి కోతి తన పిల్ల వద్ద ఇలా కూర్చొని సుమారు 45 నిమిషాలు పాటు కంటతడి పెట్టుకుంది.


ఈ ఘటనతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కోతులు అటుగా వెళుతోన్న వాహనదారులపై ఎగబడ్డాయి. దాదాపు గంట సేపు బీభత్సం సృష్టించాయి. ఆ తర్వాత చనిపోయిన పిల్లకోతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి శివారులోని శ్రీమిత్ర టౌన్‌ షిప్‌ వద్ద హైదరాబాద్‌ రహదారిలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది

Updated Date - Nov 04 , 2024 | 04:22 AM