BJP: కేటీఆర్‌కు కుక్క కూడా ఓటేయదు: అర్వింద్
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:52 AM
మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు కుక్క కూడా ఓటు వేయదని, ఆయన తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా ఫలితం ఉండదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
జగిత్యాల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు కుక్క కూడా ఓటు వేయదని, ఆయన తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినా ఫలితం ఉండదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ అనుసరించిన దుర్మార్గపు విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇక బీజేపీనే ప్రత్యామ్నాయమని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని పేర్కొన్నారు.
జగిత్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నేచురల్ డెత్ అన్నట్లుగా ఉందని, పది నెలల్లో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కనీసం సమీక్షలు నిర్వహించని సీఎం రేవంత్‌రెడ్డిని.. ప్రజలందరూ తిడుతున్నారని వ్యాఖ్యానించారు.
Updated Date - Nov 03 , 2024 | 03:52 AM