ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: మంత్రి కోమటిరెడ్డి పోకడులను ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ప్రతిఘటించాలి

ABN, Publish Date - Jan 29 , 2024 | 06:53 PM

ప్రజాస్వామ్య వాదులంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) పోకడులను తీవ్రంగా ప్రతిఘటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు.

యాదాద్రి-భువనగిరి: ప్రజాస్వామ్య వాదులంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) పోకడులను తీవ్రంగా ప్రతిఘటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లా పరిషత్ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి అవమానించడాన్ని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని హరీష్ రావు అన్నారు.

యాదాద్రి భువనగిరి జెడ్పీచైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చెప్పారు. మంత్రి తాను మాట్లాడింది చాలదన్నట్టు.. పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపించారని మండిపడ్డారు. కోమటి రెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Updated Date - Jan 29 , 2024 | 06:55 PM

Advertising
Advertising