Crime News: దారుణం.. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్య
ABN, Publish Date - Jun 09 , 2024 | 10:57 AM
మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండరు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోయి పిల్లల జీవితాలు నరకప్రాయం చేస్తున్నారు.
సూర్యాపేట: మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండరు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోయి పిల్లల జీవితాలు నరకప్రాయం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే హుజూర్ నగర్(Huzur Nagar)లో జరిగింది. భార్య వివాహేతర సంబంధం(Extra-marital affair) పెట్టుకుందని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలియడంతో పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాత్రం ప్రియుడ్ని వదిలుకునేందుకు సిద్ధపడలేదు. దీంతో మనస్థాపం చెందిన భర్త ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు బాధ మెుత్తం సెల్ఫీ వీడియోలో వివరించాడు. "తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. పిల్లలు జాగ్రత్త అని చెల్లెలకు చెబుతూ తన భార్యను వదిలిపెట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. హుజూర్నగర్ పోలీసులు కేసు నిర్లక్ష్యం చేశారని" సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి:
Ramoji Rao: రామోజీరావు చివరి వీడ్కోలుకు ఏర్పాట్లు పూర్తి..
Car Accident: పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ఎంతమంది గాయపడ్డారంటే..?
Updated Date - Jun 09 , 2024 | 10:57 AM