ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy: ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా..

ABN, Publish Date - Feb 17 , 2024 | 08:00 AM

నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

నల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి చెర్వుగట్టులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్లీ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే మూడు నెలల్లో బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తారని, మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీటి విడుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అదే రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ, చెర్వుగట్టులో ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుందన్నారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే కాలంలో బ్రాహ్మణ వెళ్ళేంల , ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి పేదల గుండెల్లో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాగా స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - Feb 17 , 2024 | 08:00 AM

Advertising
Advertising