ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:59 AM

Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.

Nagarjuna Sagar Dam

నల్గొండ, ఆగస్టు 5: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar Project) భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5 నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి మరికొన్ని గేట్లు ఎత్తనున్నట్లు సమాచారం. దాదాపు 6 నుంచి 8 గేట్ల వరకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్


ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 2, 79,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 30, 000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరుకుంది. అలాగే సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 280 టీఎంసీలుగా కొనసాగుతోంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్టు 6 క్రస్ట్‌ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు నల్లగొండ జిల్లా (తెలంగాణ)కు చెందిన సీఈ నాగేశ్వరరావు తెలిపారు.

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ


2 లక్షల క్యూసెక్కులను విడుదల చేసి అనంతరం ఇన్ ఫ్లోను బట్టి పెంచే అవకాశం ఉంది. కృష్ణా లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సాగర్‌ జలాశయానికి 4,27,711 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది.


ఇవి కూడా చదవండి...

Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!

Teharan : మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 12:01 PM

Advertising
Advertising
<