నారాయణ స్కూల్స్ పూర్వ విద్యార్థికి ఐఈఎస్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:43 AM
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (ఐఈఎస్) 2024 (సివిల్ ఇంజనీరింగ్)లో నారాయణ స్కూల్స్ పూర్వ విద్యార్థి రోహిత్ ధొండ్గే ఆలిండియా ఫస్ట్ (1) ర్యాంక్ సాధించాడు.
హైదరాబాద్, నవంబరు 27: ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (ఐఈఎస్) 2024 (సివిల్ ఇంజనీరింగ్)లో నారాయణ స్కూల్స్ పూర్వ విద్యార్థి రోహిత్ ధొండ్గే ఆలిండియా ఫస్ట్ (1) ర్యాంక్ సాధించాడు. అంకితభావం, నిరంతర సాధనతో ఈ రికార్డును స్వంతం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఓ ప్రకటనతో తెలిపింది. రోహిత్ ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించటంపట్ల నారాయణ గ్రూప్ డైరెక్టర్స్ డా. పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. నారాయణ స్కూల్‌లోని బేసిక్ కాన్సె్‌ప్ట్సపై వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్, నారాయణ ప్రోగ్రామ్స్, టీచింగ్... రోహిత్ విజయానికి ఎంతోగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు రోహిత్ ఢొండ్గే మరియు అతని కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రోహిత్ ఇలాగే అద్భుత విజయాలను సాధించాలని కోరారు.
Updated Date - Nov 28 , 2024 | 04:43 AM