ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు పింఛన్‌ ఇవ్వాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 04:41 AM

ఎమ్మెల్యేలు, ఎంపీల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్నట్లే స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛన్‌ సౌకర్యాన్ని కల్పించాలని జాతీయ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం డిమాండ్‌ చేసింది.

  • జాతీయ పంచాయతీరాజ్‌ చాంబర్‌ డిమాండ్‌

  • చాంబర్‌ జాతీయ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌

ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు, ఎంపీల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్నట్లే స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛన్‌ సౌకర్యాన్ని కల్పించాలని జాతీయ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం డిమాండ్‌ చేసింది. ఖమ్మంలో జరుగుతున్న చాంబర్‌ సంయుక్త సమావేశాలు ఆదివారం ము గిశాయి. ఈ సమావేశంలో చాంబర్‌ జాతీయ అధ్యక్షుడిగా యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌ (ఏపీ), జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పుసులూ రి నరేందర్‌ (తెలంగాణ), జాతీయ ఉపాధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణరెడ్డి, ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత సర్పంచులు చేసిన గ్రామాభివృద్థి పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తక్షణమే ఆ బిల్లులను చెల్లంచాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్చంచులకూ ఓటు హక్కు కల్పించాలని తీర్మానించారు.

Updated Date - Nov 11 , 2024 | 04:41 AM