Pension: వికలాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాలి
ABN, Publish Date - Oct 28 , 2024 | 05:35 AM
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచాలని, పెంచిన పింఛన్‌ను 2024 జనవరి నుంచే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచాలని, పెంచిన పింఛన్‌ను 2024 జనవరి నుంచే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం డిసెంబర్‌లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు.
కమిటీ రాష్ట్ర 4వ మహాసభలు అక్టోబరు 25-26 తేదీల్లో నిర్వహించామని, వికలాంగులు ఎదుర్కొంటున్న 18 రకాల సమస్యలపై తీర్మానాలు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన మహాసభల్లో 75 మందితో రాష్ట్ర కమిటీని, 23 మందితో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎన్నికైనట్టు తెలిపారు. కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా వరమ్మ, అధ్యక్షులుగా కె.వెంకట్, కోశాధికారిగా ఆర్.వెంకటేశ్ ఎన్నికైనట్లు అడివయ్య తెలిపారు.
Updated Date - Oct 28 , 2024 | 05:35 AM