V. Lachireddy: విత్తన ధ్రువీకరణ సంస్థకు శాఖాపరమైన హోదా ఇవ్వాలి!
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:45 AM
విత్తన ధ్రువీకరణ సంస్థను వ్యవసాయ, సహకారశాఖ మాదిరిగా ఒక ప్రత్యేక విభాగం కింద పరిగణించి శాఖాపరమైన హోదా కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విత్తన ధ్రువీకరణ సంస్థను వ్యవసాయ, సహకారశాఖ మాదిరిగా ఒక ప్రత్యేక విభాగం కింద పరిగణించి శాఖాపరమైన హోదా కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన విత్తన ఽధ్రువీకరణ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమమే జేఏసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విత్తన ఽధ్రువీకరణ సంస్థలో ఉన్నత విద్యావంతులు పనిచేస్తున్నారని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సంస్థ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా జేఏసీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Updated Date - Nov 25 , 2024 | 03:45 AM