ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మాగంటి గోపినాథ్‌ సర్వేపై ఫైర్

ABN, Publish Date - Apr 04 , 2024 | 06:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోసారి వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చెపట్టబోతున్నారంటూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపినాథ్ జోస్యం చెప్పారు.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోసారి వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చెపట్టబోతున్నారంటూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపినాథ్ జోస్యం చెప్పారు. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గోపినాథ్ జోస్యంపై నెటిజన్లు తమదైన శైలీలో మండిపడుతున్నారు.

మాగంటి గోపినాథ్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైందో.. అందుకు కారణాలేమిటో ముందు... ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరిస్తే బావుటుందని వారు సూచిస్తున్నారు. గతంలో జూబ్లిహిల్స్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన మీరా? ఆంధ్ర రాజకీయాలపై జోస్యం చెప్పేదంటూ వారు మండిపడుతున్నారు.


ముందు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందో? లేదో? చెప్పండని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హస్తం ఉందో తేల్చాలని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే కారు పార్టీ నుంచి కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర గద్వాల్ విజయలక్ష్మీ, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్‌తోపాటు పలువురు ఎమ్మెల్యే, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారని.. మరి భవిష్యత్తులో కారు పార్టీ వీడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఓ చర్చ అయితే నడుస్తుందని.. అలాంటి వేళ పార్టీ మారే వారి పేర్లు సైతం ప్రకటించాని మాగంటి గోపినాథ్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు.

అదీకాక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్వహస్తలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీ స్థాపితమై 40 ఏళ్లు దాటిందని.. నేటికి ఆ పార్టీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిందని వారు అంటున్నారు. కేవలం అయిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి.. ఇలా పక్క రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో జోస్యం చెప్పడం ఏం బాగోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 06:18 PM

Advertising
Advertising