ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్ట్స్‌ కమిషనర్‌గా శశాంక

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:15 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొత్త పథకాలు, కార్యక్రమాలను పర్యవేక్షించేందుకుగాను ‘స్టేట్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్ట్స్‌ కమిషనర్‌’ పేర ఈ పోస్టును ఏర్పాటు చేసింది.

  • కొత్త కొలువును సృష్టించిన ప్రభుత్వం

  • భారీగా ప్రత్యేక కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ.. 70 మందికి స్థానచలనం

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొత్త పథకాలు, కార్యక్రమాలను పర్యవేక్షించేందుకుగాను ‘స్టేట్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్ట్స్‌ కమిషనర్‌’ పేర ఈ పోస్టును ఏర్పాటు చేసింది. దీనికి.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న కె.శశాంకను కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో.. నలగొండ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, నాలుగు జిల్లాల డీఆర్‌వోలు, 47 మంది డిప్యూటీ కలెక్టర్లున్నారు.


ఇదే క్యాడర్‌కు చెందిన ఎల్‌. రమేష్‌, ఎన్‌. ఆనంద్‌కుమార్‌, వి.హనుమనాయక్‌ను రెవెన్యూ సర్వీసె్‌స-1లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. బదిలీలకు ముందు ప్రభుత్వం ప్రతి అధికారి పనితీరు మీదా విజిలెన్స్‌ నివేదికను తెప్పించింది. బదిలీలు కోరుకున్న డిప్యూటీ కలెక్టర్లకు లేఖలు ఇచ్చేందుకు వారి నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేసినట్లు కూడా విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా.. పర్యాటక శాఖ డైరెక్టర్‌ ఇలా త్రిపాఠీని నల్లగొండ కలెక్టర్‌గా.. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ హన్మంతరావును యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న జెండగే హనుమంత్‌ కొండిబాను పర్యాటక శాఖ డైరెక్టర్‌గా నియమించి, దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌(సీడీఎంఏ)గా నియమించింది.


ఇప్పటివరకూ ఈ పోస్టు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వీపీ గౌతమ్‌ను రిలీవ్‌ చేసింది. నిజామాబాద్‌ మునిసిపల్‌ కమిషనర్‌ మంద మకరందును.. భూపరిపాలన కమిషనరేట్‌(సీసీఎల్‌ఏ)లో ప్రాజెక్టు డైరెక్టర్‌(సీఎంఆర్‌వో)గా నియమించింది. రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌.హరీశ్‌ను.. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌, ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి టి.వినయ్‌కృష్ణారెడ్డిని.. సాగునీటి పారుదల శాఖలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ (రీహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌) విభాగం కమిషనర్‌గా నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న అయేషా మస్రత్‌ ఖానమ్‌కు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది.


తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తికి.. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర క్రీడల శాఖ డైరెక్టర్‌ కొర్రా లక్ష్మిని.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీగా నియమించింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఎండీ, ఐఎ్‌ఫఎస్‌ అధికారి సోనీ బాలాదేవికి క్రీడల శాఖ డైరెక్టర్‌గా.. ‘హాకా’ ఎండీ కె.చంద్రశేఖర్‌ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా.. అదనపు బాధ్యతలు అప్పగించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సీఈవో ఎస్‌.దిలీ్‌పకుమార్‌ను బదిలీ చేసి నిజామాబాద్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా నియమించింది. మరో ముగ్గురు ఐఎ్‌ఫఎస్‌ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీ శాఖ జోగుళాంబ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ క్షితిజను.. షెడ్యూల్డు కులాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌గా పని చేస్తున్న వీవీఎల్‌ సుభద్రాదేవిని.. జీహెచ్‌ఎంసీలోని అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అదనపు కమిషనర్‌గా నియమించింది. రాజన్న సర్కిల్‌ అటవీ సహాయక కన్జర్వేటర్‌ జ్ఞానేశ్వర్‌ను వికారాబాద్‌ డీఎ్‌ఫవోగా నియమించింది.

Updated Date - Oct 29 , 2024 | 03:15 AM