TG : ఇథనాల్ పరిశ్రమ వద్దే వద్దు
ABN, Publish Date - Aug 14 , 2024 | 03:06 AM
గ్రామ శివారులో చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌వాసులు ఆందోళన చేపట్టారు. మంగళవారం దిలావర్‌పూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామస్థుల ఆందోళన
దిలావర్‌పూర్, ఆగస్టు 13: గ్రామ శివారులో చేపట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌వాసులు ఆందోళన చేపట్టారు. మంగళవారం దిలావర్‌పూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. షాపులు, హోటళ్లు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా 61వ నెంబరు జాతీయ రహదారిపై గ్రామస్థులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపైనే భోజనం చేశారు. అనంతరం పలువురు దిలావర్‌పూర్ గ్రామస్థులు మాట్లాడుతూ, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇథనాల్ పరిశ్రమ నిర్మిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Updated Date - Aug 14 , 2024 | 07:40 AM