ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SI Krishna Kumar: ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై

ABN, Publish Date - Nov 09 , 2024 | 03:40 AM

ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్‌ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వర్ని(కోటగిరి), నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్‌ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వర్ని మండలంలోని కోటయ్య క్యాంప్‌నకు చెందిన నాగరాజుకు శ్రీకాంత్‌ అనే వ్యక్తితో ఐదు రోజుల క్రితం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘటనలో శ్రీకాంత్‌ తలకు గాయమైంది. దీంతో అతని ఫిర్యాదు మేరకు నాగరాజుపై ఎస్సై కృష్ణకుమార్‌ కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తనకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాల్సిందిగా నాగరాజు ఎస్సైని కోరాడు.


అయితే బెయిల్‌ ఇవ్వాలంటే రూ.50వేలు లంచం ఇవ్వాలని కృష్ణకుమార్‌ డిమాండ్‌ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని రూ. 20వేలు మాత్రమే ఇస్తానని బాధితుడు చెప్పడంతో సరేనన్నాడు. అయితే నాగరాజు.. ఏసీబీని ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మూడు రోజులుగా ఎస్సైపై నిఘా పెట్టి శుక్రవారం పీఎ్‌సకు సమీపంలో బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా కృష్ణకుమార్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 03:40 AM