ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kavitha: బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఆగ్రహం.. ఎందుకంటే..?

ABN, Publish Date - Jan 08 , 2024 | 04:25 PM

నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మీద కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత మండిపడ్డారు.

నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని, తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆత్మపరిశీలన చేసుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈసారి నిజామాబాద్‌లో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా అందివ్వాలని కవిత కోరారు.

జిల్లాపై పట్టు సాధించేందుకు..

కాగా.. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఆ పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగి లోక్‌సభ ఎన్నికల్లో రాణించడంపై దృష్టి సారించారు. పార్టీ ఓడిపోడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంలో పలు జిల్లాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈసారి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో బీఆర్ఎస్‌కి పట్టున్న నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి కూడా మంచి పట్టుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించకపోవడంతో ఆ పార్టీ నేతలు ఈ జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 04:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising