ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణలో సమీకృత స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యంకాదు:కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:10 AM

సెయిల్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు అవకాశంలేదని గతంలోనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపిందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సెయిల్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు అవకాశంలేదని గతంలోనే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపిందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వీలుగా టీఎ్‌సఎండీసీఎల్‌కు 65.20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుము ఖనిజ నిల్వల కోసం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం 2019లో పంపిందన్నారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ, ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ చర్చలు జరిపాయని చెప్పారు. ఈ పరిశీలనలో తెలంగాణలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌) ఆధ్వర్యంలో సమీకృత స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని ఉక్కు మంత్రిత్వ శాఖ చెప్పినట్లు తెలిపారు. ముడి ఇనుము, ఖనిజ ప్రాంతాన్ని రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వప్రతిపాదనను 2021లో తిరిగి పంపించినట్లు కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

Updated Date - Dec 12 , 2024 | 04:10 AM