Khammam: కథా సాహిత్యానికి మంచి రోజులు
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:41 AM
కథా సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. ఈస్థటిక్స్ స్పేస్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో మొదలైన కథాంతరంగం సాహిత్య కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా
ఘనంగా ప్రారంభమైన కథాంతరంగం
ఖమ్మం సాంస్కృతికం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కథా సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. ఈస్థటిక్స్ స్పేస్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలో మొదలైన కథాంతరంగం సాహిత్య కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ప్రసేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓల్గా మాట్లాడారు. కవిత్వంతో పోలిస్తే కథకు ఆదరణ తగ్గిందని, కథ పని అయిపోయిందని సాహిత్యకారులు అభిప్రాయపడుతున్న దశలో యువ కథకుల కథా ప్రతిభ చూస్తుంటే కథకు పూర్వయుగం ప్రారంభమైనట్లు అనిపిస్తోందన్నారు. సండే మ్యాగజైన్లు, కఽథల పోటీలు, కఽథా సంపుటాలు, సంకలనాల్లో కొత్త కథకుల ప్రతిభ తెలుస్తోందన్నారు. కవిత్వ గుమ్మంగా ఉన్న ఖమ్మం నుంచి కఽథ పరిపుష్టం చేసే క్రతువును ఈస్థటిక్స్ స్పేస్ సాహిత్య సంస్థ భుజాన వేసుకోవటం అభినందనీయం అన్నారు.
అంతరించి పోయే దశకు చేరిన కథ ఖమ్మం వేదికగా తిరిగి ప్రాణం పోసుకుంటుండటం సంతోషకరమని ప్రముఖ సాహితీవేత్త ఎల్‌ఎ్‌సఆర్ ప్రసాద్ అన్నారు. సాహిత్యం సమాజానికి దిక్సూచీ అని ఈస్థటిక్స్ స్పేస్ సాహిత్య సంస్థ బాధ్యుడు, కవి, విద్యావేత్త రవి మారుత్ అన్నారు. కార్యక్రమంలో కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారం, ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ కఽథా రచయిత, విమర్శకుడు వంశీ కృష్ణ, జాషువా సాహిత్య సంస్ధ బాధ్యుడు డాక్టర్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ప్రముఖ సాహితీవేత్త ముక్కామల చక్రధర్ తదితరులు కథాంతరంగం కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
Updated Date - Dec 15 , 2024 | 03:41 AM