ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sankranti: రహదారులపై రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద వాహనాల బారులు..

ABN, Publish Date - Jan 12 , 2024 | 10:57 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగకు సెలవులు ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగకు సెలవులు ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు బయల్దేరారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ నెలకొంది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోనుంది. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్ లోని చిల్లకల్లు, కీసర టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. అయితే.. ఫాస్టాగ్ విధానం అమలవుతుండటంతో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగానే టోల్ ప్లాజా దాటిపోతున్నారు. నేటి నుంచి సెలవులు రావడంతో రద్దీ మొదలు కానుంది.

అన్ని టోల్‌ప్లాజాల పంతంగి టోల్‌గేట్‌ వద్దనే రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో 16 టోల్‌ చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ దాటిన తర్వాత రద్దీ అంతగా ఉండదు. నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు.. కొర్లపహాడ్‌ దాటాక ఉమ్మడి ఖమ్మం వైపు వెళ్లిపోవడంతో రద్దీ అంతగా ఉండదు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే విధమైన రద్దీ ఉంటుంది. గతేడాది సంక్రాంతి సమయంలో పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 60వేల వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 10:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising