Patancheru: హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్...
ABN, Publish Date - Sep 04 , 2024 | 11:52 AM
సోషల్ వర్కర్ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్ పేరుతో జూబ్లీహిల్స్(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు.
- సోషల్‌వర్కర్ పేరుతో ఫిర్యాదుల దందా
- హైడ్రా కమిషనర్, మంత్రులతో దిగిన ఫొటోలతో బెదిరింపులు
- బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
పటాన్‌చెరు(హైదరాబాద్): సోషల్ వర్కర్ ముసుగులో హైడ్రా పేరు చెప్పి రూ. 20 లక్షలు ఇవ్వాలని బిల్డర్లను డిమాండ్ చేసిన వ్యక్తిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్(Sangareddy District Aminpur) మున్సిపాలిటీ పరిధిలో సాయివిల్లాస్ రోడ్డులో ఎంసీఆర్‌ఓ ప్రాజెక్ట్ పేరుతో జూబ్లీహిల్స్(Jubilee Hills)కు చెందిన బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ, అపార్ట్‌మెంట్ పెద్దచెరువు నాలా బఫర్‌జోన్ పరిధిలోకి వస్తుందని, అదే కాలనీలో అద్దెకు ఉండే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండ్ల విప్లవ్‌సిన్హా కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఇదికూడా చదవండి: Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన చిరంజీవి.. ఎంతంటే..
ఫ్లాట్లు చూసేందుకు వచ్చే కస్టమర్లకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన పలు ప్రభుత్వ శాఖలకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు అమీన్‌పూర్‌లో పర్యటించిన సందర్భంలో ఠంచన్‌గా ప్రత్యక్షమై ఆయనతో ఫొటోలు తీయించుకున్నాడు. గత నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిన మరుసటి రోజు బిల్డర్లు రాజేంద్రనాథ్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డిలను అశోక్‌నగర్ పిస్తాహౌజ్ వద్దకు పిలిపించి, తనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా దగ్గర అని ఫొటోలు చూపించి బెదిరించాడు.
అపార్ట్‌మెంట్ కూల్చకుండా ఉండాలంటే తనకు రూ.20 లక్షలు ముట్టచెప్పాలని లేదంటే, పత్రికల్లో వార్తలు రాయించి కూల్చివేయిస్తానన్నాడు. మరోమారు గచ్చిబౌలి ఆఫ్రికన్ కాఫీ హౌజ్ వద్దకు పిలిపించి తక్షణం ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కూల్చడం ఖాయమని తీవ్రంగా బెదిరించాడు. హైడ్రా కమిషనర్‌తో పాటు గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహతో దిగిన ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేయడంతో బిల్డర్లు కంగుతిన్నారు. ఇతడి వేధింపులు భరించలేక బాధితులు అమీన్‌పూర్ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమీన్‌పూర్ ఎస్‌ఐ టి.విజయరావు తెలిపారు.
..............................................................
ఈ వార్తను కూడా చదవండి:
...............................................................
Secunderabad: రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు..
- బుకింగ్ కౌంటర్‌లో సాధారణ టికెట్ల కోసం క్యూ
సికింద్రాబాద్: తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు, ట్రాక్‌ల కింద మట్టి కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) చాలా రైళ్లను రద్దు చేసింది. దీంతో ఆయా ప్రాంతాలకెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది రైళ్లు రద్దు కావడంతో మూడురోజులుగా సికింద్రాబాద్ స్టేషన్‌లో జనం రద్దీ తగ్గిపోయింది. సికింద్రాబాద్(Secunderabad) నుంచి వెళ్లే సింహపురి, మణుగూరు, శాతవాహన, చార్మినార్(Simhapuri, Manuguru, Satavahana, Charminar), విశాఖ, భాగ్యనగర్, కాకతీయ, బీదర్ వంటి రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
సికింద్రాబాద్ నుంచి వెళ్లే సంత్రగచ్ ఎక్స్‌ప్రెస్(Santragach Express) రైలు మంగళవారం 6 గంటలు ఆలస్యంగా వెళ్లింది.
రిజర్వేషన్ కోసం పడిగాపులు: సికింద్రాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. రేతిఫైల్ బస్టాండ్(Ratefile Bus Stand) సమీపంలోని రిజర్వేషన్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. అయితే కొన్ని రైళ్లలో రిజర్వేషన్ మినహా జనరల్ టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 04 , 2024 | 11:52 AM