ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam: ఇంకెంతకాలం మాలలను అణచివేస్తారు?

ABN, Publish Date - Oct 26 , 2024 | 04:58 AM

దళితులకు రాజ్యాంగ అధికారం దక్కకూడదనే కుట్రతోనే ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆరోపించారు.

  • మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌

  • భద్రాద్రిలో మాలల మహా పాదయాత్ర ప్రారంభం

భద్రాచలం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): దళితులకు రాజ్యాంగ అధికారం దక్కకూడదనే కుట్రతోనే ఎస్సీలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, న్యాయస్థానాలు.. మనువాదుల జేబు సంస్థలుగా మారాయని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం మాలల మహా పాదయాత్ర ప్రారంభమైంది. భద్రాద్రి నుంచి హైదరాబాద్‌ వరకు చేపడుతున్న ఈ యాత్రను జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌ జెండా ఊపి ప్రారంభించారు.


అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ, న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్రంలో అమలు సాధ్యమా, కాదా అనే విషయాన్ని పరిశీలించకుండా.. వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో మాదిగలు, మాలలు జనాభాపరంగా సమానంగా ఉన్నారని, అయినా మాలలను తక్కువ చేసి చూపుతున్నారని వాపోయారు. ఏ రీతిన వర్గీకరణ చేపడుతుందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మందకృష్ణ మాదిగ మనువాదుల ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. మోదీ, రేవంత్‌ను తరిమికొట్టేందుకు మాలలు సిద్ధంగా ఉండాలని పిల్లి సుధాకర్‌ పిలుపునిచ్చారు. 38 రోజుల పాటు కొనసాగే మాలల మహాపాదయాత్ర డిసెంబరు 1న హైదరాబాద్‌లో నిర్వహించబోయే మాలల మహాసంగ్రామ సభతో ముగియనుంది.

Updated Date - Oct 26 , 2024 | 04:58 AM