ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: దేశానికి వినూత్న ఆవిష్కరణలు అందించాలి

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:04 AM

వినూత్నంగా ఆలోచించే యువత, సాంకేతికపరమైన శక్తి సంపత్తులే భారత్‌ బలాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

  • ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’లో ప్రధాని మోదీ

  • దేశంలో 51 కేంద్రాల్లో 17 అంశాలపై ఆవిష్కరణలు

  • ఐఐటీ హైదరాబాద్‌లో వ్యవసాయ రంగంపై పోటీలు

కంది, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వినూత్నంగా ఆలోచించే యువత, సాంకేతికపరమైన శక్తి సంపత్తులే భారత్‌ బలాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. బుధవారం దేశవ్యాప్తంగా 51 కేంద్రాల్లో ప్రారంభమైన ఏడో విడత స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2024 ఫైనల్‌లో పాల్గొన్న 1,300కు పైగా విద్యార్థి బృందాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. దేశానికి వినూత్నమైన ఆవిష్కరణలు అందించాలని.. సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపాలన్నారు. ఈ స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ లాంఛనప్రాయ కార్యక్రమం కాదని.. దేశ యువత నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకుఓ వేదికని చెప్పారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ప్రారంభమైన నాటి నుంచి లక్షలాది మంది యువత ఇందులో భాగస్వాములయ్యారని, ఇప్పటివరకు చేసిన ఆవిష్కరణలు చాలా సమస్యలకు పరిష్కారం చూపాయని వెల్లడించారు. ఈసారి 17 విభిన్న అంశాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో వ్యవసాయం రంగంపై విద్యార్థులు ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు.


దేశం నలుమూలల నుంచి 200 మంది వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు 26 జట్లుగా ఏర్పడి 36 గంటల పాటు శ్రమించి వ్యవసాయ రంగంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొననున్నారు. ఇందులో రైతులు పంట వేసుకునేటప్పుడు విత్తనాల దగ్గరినుంచి ఉత్పత్తులను అమ్ముకునేవరకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఫసల్‌ బజార్‌, ఫసల్‌ నీతి, కృషి ఆరోగ్య, కర్షక్‌ సేథు పేర్లతో మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్లను తయారు చేస్తున్నారు. ఏ వాతావరణంలో ఏ పంట వేసుకోవాలి, చీడపీడల నివారణ, అధిక దిగుబడి కోసం ఏ పురుగుల మందులు, ఏ ఎరువులను వాడాలి.. పంట కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీపంలోని కొనుగోలు కేంద్రాల వివరాలు.. తదితర సమాచారాన్ని అన్ని భాషల్లో ఆయా యాప్‌లు, వెబ్‌సైట్లల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. రైతును లాభసాటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు రూపొందుతున్నాయన్నారు. విద్య, పరిశ్రమల భవిష్యత్తు, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు విద్యార్థులను ప్రోత్సహించడమే స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ హ్యాకథాన్‌లో ప్రతిభ కనబర్చిన మొదటి నాలుగు టీమ్‌లను ఎంపిక చేసి ఒక్కో టీమ్‌కు రూ.లక్ష నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Dec 12 , 2024 | 04:04 AM