POCSO Court: బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:26 AM
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దాంతోపాటు రూ.25వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయాధికారి కె.జయంతి శుక్రవారం తీర్పు చెప్పారు.
సంగారెడ్డి క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దాంతోపాటు రూ.25వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయాధికారి కె.జయంతి శుక్రవారం తీర్పు చెప్పారు. న్యాల్‌కల్ మండలం అమీరాబాద్‌కు చెందిన మాలి పటేల్ వసంత్‌రావు అలియాస్ పింటు (30) అదే గ్రామానికి చెందిన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
గర్భవతి కావడంతో మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. దీనిపై బాధితురాలు 2018 జూలై 7న హత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుపై పోలీసులు పూర్తి ఆధారాలను కోర్టులో సమర్పించారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారని ఎస్పీ రూపేష్ చెప్పారు.
Updated Date - Nov 23 , 2024 | 04:31 AM