ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:08 AM

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఆశ వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏకంగా ఉన్నత స్థాయి అధికారులే రంగంలోకి దిగి.. పలువురు మహిళలను ఈడ్చి వ్యాన్‌లో పడేశారు.

  • పోలీసుల దురుసు ప్రవర్తన

  • కాలు విరిగి, తీవ్ర గాయాలతో స్పృహ తప్పిన ఓ ఆశ వర్కర్‌

  • ఐదుగురికి స్వల్ప గాయాలు

  • డీఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం

మంగళ్‌హాట్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఆశ వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏకంగా ఉన్నత స్థాయి అధికారులే రంగంలోకి దిగి.. పలువురు మహిళలను ఈడ్చి వ్యాన్‌లో పడేశారు. మహిళా పోలీసులు ఉన్నా అదుపు చేయలేకపోవడం, పురుష పోలీసులు రంగంలోకి దిగడంతో ఆశ వర్కర్ల ఆందోళన ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలోనే ఓ సీఐపై ఆశ వర్కర్‌ చేయి చేసుకోవడం.. మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఆశ వర్కర్లపై పురుష పోలీసులు చేయి చేసుకోవడమే కాకుండా వస్త్రాలను లాగుతూ ఆక్రోశం ప్రదర్శించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వేతనాన్ని రూ.18వేలకు పెంచాలని కోరుతూ సోమవారం బీఆర్‌పీయూ ఆధ్వర్యంలో రాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి 2 వేల మంది ఆశ వర్కర్లు కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్దకు వచ్చారు. తొలుత కార్యాలయం సమీపంలో ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా... భారీగా పోలీసులు మోహరించారు.


ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు మధ్యాహ్నం వరకు వేచి ఉన్న మహిళలు.. కోఠి ప్రధాన రహదారిపై నిరసన తెలిపేందుకు బారికేడ్లను నెట్టుకుం టూ రోడ్డుపైకి రావడతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసేందుకు ఉపక్రమించారు. ఈ క్రమం లో మహిళా పోలీసులు వారిని అదుపు చేయలేకపోవడంతో పురుష పోలీసులు రంగంలోకి దిగి.. దొరికిన వారిని దొరికినట్టు ఈడ్చిపడేసి వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ క్రమంలో రహిమాబీ(39) అనే ఆశ వర్కర్‌ కాలు విరిగి, తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. మరో మహిళకు సైతం గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న ఆశ వర్కర్‌ ఒకరు ఆవేశంతో సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసాచారి చెంప చెళ్లుమనిపించింది. దీంతో అక్కడ ఉన్న మహిళ పోలీసులతోపాటు ఏసీపీ, ఇతర పురుష కానిస్టేబుళ్లు ఆమెను కొడుతూ లాగిపడేశారు. దీంతో అక్కడ ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆశలను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనలో రహిమాబీతోపాటు మొత్తం ఐదుగురికి గాయాలు కాగా.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏడాదిగా ప్రతిఅధికారి, మంత్రిని కలిసి హామీని నెరవేర్చాలని కోరగా కనీసం స్పందించలేదని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోషా ఆరోపించారు.


పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నేతలు

ఆశవర్కర్లపై పోలీసుల వ్యవహారశైలికి సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌లు ఉస్మానియా ఆస్పత్రిలో రహిమాబీని పరామర్శించారు.

Updated Date - Dec 10 , 2024 | 05:08 AM