ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్‌

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:24 AM

ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

  • రాహుల్‌గాంధీ మాస్క్‌లు ధరించి అభ్యర్థుల ర్యాలీ.. చెదరగొట్టిన పోలీసులు.. వీధుల్లోకి పారిపోయిన అభ్యర్థులు

  • కేసుల పరిష్కారం తర్వాత పరీక్ష

  • నిర్వహించాలనే డిమాండ్‌తో అభ్యర్థుల ర్యాలీ

  • చెదరగొట్టిన పోలీసులు.. అనంతరం

  • బీజేవైఎం నేతృత్వంలో మళ్లీ ర్యాలీ

చిక్కడపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈనెల 21 నుంచి జరగనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహిస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 150 మంది అభ్యర్థులు రాహుల్‌గాంఽధీ మాస్కులు ధరించి గాంధీనగర్‌ ఆంధ్రాకేఫ్‌ నుంచి ధర్నాచౌక్‌కు ర్యాలీ ప్రారంభించారు. ఈ క్రమంలో అశోక్‌నగర్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. దాంతో నిరసనకారులు వీధుల్లోకి పారిపోయారు. పోలీసులు వెంటపడి తమను బాదారని అభ్యర్థులు చెప్తున్నారు. ప్రభుత్వానికి తమ డిమాండ్‌ తెలియజేయాలని నిరసనలు చేస్తుంటే పోలీసులు తమను నేరస్థులుగా చూస్తూ ఇష్టం వచ్చినట్లు తరుముతున్నారని, కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గ్రూప్‌-1 సంబంధించి కోర్టులో అనేక కేసులున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ను వారు కోరారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దానివల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, అయినా మొండిగా వ్యవహరిస్తే వచ్చే దసరా నాటికి ఈ ప్రభుత్వం లేకుండా పోతుందని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రూప్‌- 1 అభ్యర్థులు ఆంధ్రాకేఫ్‌ నుంచి గాంధీనగర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్దకు ర్యాలీగా చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి నినాదాలు చేయగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.


  • కిషన్‌ రెడ్డిని కలిసిన అభ్యర్థులు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసేలా రాష్ట్రప్రభుత్వంపై వత్తిడి తేవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని అభ్యర్థులు కోరారు. శుక్రవారం గాంధీనగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రిని 100 మంది గ్రూప్‌ 1 అభ్యర్థులు కలిశారు. సానుకూలంగా స్పందించిన కిషన్‌రెడ్డి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని తమ పార్టీ పక్షాన డిమాండ్‌ చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Oct 19 , 2024 | 03:24 AM