ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: బీఆర్‌ఎస్‌ నేతల గృహ నిర్బంధం

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:34 AM

తమ పార్టీ నేతల అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

  • 8న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌/నార్సింగ్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నేతల అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయమే బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్ల వద్దకు చేరుకుని వారిని హౌస్‌ అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఇళ్ల వద్ద మోహరించి వారిని నిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి తలసాని, పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు కృష్ణారావు, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సంజయ్‌, పార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులను హౌస్‌ అరెస్టు చేశారు.


దీనిపై హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు. కాగా, ఈనెల 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సభకు హాజరవుతారా? లేదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 8న ఎర్రవెల్లిలో కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. సభలో సర్కారును ఇరుకున పెట్టేందుకు ఏం చేయాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీ తర్వాతే కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? రారా? అనేది వెల్లడయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

Updated Date - Dec 07 , 2024 | 04:34 AM