ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకున్న పోలీసులు

ABN, Publish Date - May 29 , 2024 | 01:09 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు గంటలుగా ఉమామహేశ్వరరావు ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఉమామహేశ్వరరావును ముగ్గురు అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఉమామహేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు గంటలుగా ఉమామహేశ్వరరావు ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఉమామహేశ్వరరావును ముగ్గురు అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఉమామహేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ విచారణ చేస్తోంది. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఏసీబీ విచారణలో మరి కొంత మంది బినామీలు వ్యవహారం బయట పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పని చేసిన సమయంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారణ నిర్వహిస్తున్నారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు


అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి.. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ నెల 22న ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేసి రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఆ వెంటనే ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఉమా మహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను నేడు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 01:09 PM

Advertising
Advertising