ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG POLITICS: ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుంది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ABN, Publish Date - May 19 , 2024 | 08:31 PM

: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడి కళ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.

Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేదవాడి కళ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ప్రజల వద్దకు శీనన్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఖమ్మం రూరల్ మండలం, వెంకటాయపాలెం, కాచిరాజుగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికల కోడ్‌కు ముందుగానే కొన్ని అమలు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం మిగిలిన హామీలను నెరవేర్చి ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందజేస్తామని చెప్పారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో కుల, మతాలను, ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. శ్రీరాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఒక తెలంగాణలోనే కాదు దేశంలోనే బీజేపీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుందని చెప్పారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమితో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు మేలు జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం: ప్రేమేందర్ రెడ్డి

Ponguleti: ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..

Congress: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి: చింతా మోహన్

TG Cabinet: మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే..!!

Updated Date - May 19 , 2024 | 09:30 PM

Advertising
Advertising