Khammam: మంత్రి పొంగులేటి కాలుకు గాయం
ABN, Publish Date - Sep 03 , 2024 | 03:57 AM
ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలుకు గాయమైంది.
కూసుమంచి, సెప్టెంబరు 2: ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలుకు గాయమైంది. మున్నేరు వరదతో ఖమ్మం రూరల్ మండలంలో దెబ్బతిన్న రాజీవ్‌గృహకల్ప ఇళ్లను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి బైక్‌పై ఆ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి బైక్‌పై వెనుక కూర్చోగా బురదవల్ల ఫుట్రె్స్టపై ఉన్న ఎడమ కాలు జారిపోయింది. దీంతో ఆ కాలు బైక్ ఫుట్రె్స్టకు తగిలి తీవ్రగాయమైంది. దీంతో ఆయన కూసుమంచి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వైద్యుడు మంత్రి కాలుకు చికిత్స చేసి కట్టుకట్టారు. తర్వాత ఆయన వరదతో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు.
Updated Date - Sep 03 , 2024 | 03:57 AM