ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana : ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా చేరికలు!

ABN, Publish Date - Jul 10 , 2024 | 06:19 AM

కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Minister Ponguleti Srinivas Reddy

  • కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా.. త్వరలోనే ధరణిలో మార్పుల ప్రక్రియ పూర్తి చేస్తాం

  • 2, 3 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు

  • నిర్దేశిత సమయంలోపే ప్రక్రియ పూర్తి

  • ఇప్పటికే వ్యవసాయశాఖకు 8-9వేల కోట్లు

  • ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ

  • జర్నలిస్టుల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం

  • మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠి

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకు 64 సీట్లు ఇస్తే.. కాంగ్రెస్‌ సర్కారును కూల్చేస్తామని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతాం’ అనే మాటలకు ముగింపు పలికితే.. చేరికలు ఆపేస్తామని తెలిపారు. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకొని, రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ఠ అన్నారు.


మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. అలాగే రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్‌ పోస్టులనూ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. రైతుల రుణమాఫీ అంచనా కొంతమేర పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయని అంచనా వేశామని, ఇందులో భాగంగా ఇప్పటికే వ్యవసాయ శాఖకు రూ.8-9 వేల కోట్లను అందించామని, మిగతా నిధులను సమీకరిస్తున్నామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం కచ్చితమైన లక్ష్యంతో ఉందని, అనుకున్న సమయానికి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి..

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన్ని అసెంబ్లీలో చూడాలని ఉందని పొంగులేటి అన్నారు. కేసీఆర్‌ అంటే తనకు ప్రేమ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ ప్రతిపక్ష హోదాలో హాజరవుతారా? అని విలేకరులు అడగ్గా.. ‘‘తాతకు పెట్టిన బొచ్చ తలాపునే ఉంటుందన్న’’ నానుడిని గుర్తుచేశారు.

కేసీఆర్‌ చేసిన వ్యవహారాలు ఇప్పుడు ఆయనకే అగ్నిపరీక్ష పెడుతున్నాయన్నారు. గతంలో ఆయనకు ప్రజలు 88 సీట్లు ఇచ్చినా తృప్తి పడకుండా.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ 19 సీట్లు గెలిస్తే 13 మందిని లాగేసుకున్నారని గుర్తుచేశారు. అప్పుడు ఆ ఘట్టాలన్నీ చూసిన వారే ఇప్పుడు బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలోకి వస్తున్నారని చెప్పారు. ‘ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరుతున్నవారంతా మీ సారథ్యంలోనే వస్తున్నారు?’

అని విలేకరులు ప్రస్తావించగా.. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని, పార్టీలోకి ఎవరు ఎక్కడినుంచైనా రావొచ్చని పొంగులేటి పేర్కొన్నారు. కాంగ్రె్‌సలో అందరూ సీఎంలే.. అందరూ ఎమ్మెల్యేలేనని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరు ఉంటారని అడగ్గా.. తాను అంతపెద్దవాడిని కాదని సమాధానం ఇచ్చారు. కేశవరావు రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారని ఓ విలేకరి అడగ్గా.. ఆయనే పోటీ చేయొచ్చని చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, కచ్చితంగా అర్హులకు లబ్ధి చేకూరుస్తామని తెలిపారు.


పింఛన్ల పెంపుపైనా సమాలోచనలు

పింఛన్ల పెంపుపైనా సమాలోచనలు చేస్తున్నామని, పింఛన్లను పెంచి ఇచ్చినా ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని పొంగులేటి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో తెల్ల రేషన్‌ కార్డు, పింఛన్ల కోసం కూడా దరఖాస్తులు అందాయని తెలిపారు. రేషన్‌కు ఒక కార్డు, వైద్యం కోసం ఒక ప్రత్యేక కార్డును అందించే అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారన్నారు.

ఇక ఇందిరమ్మ ఇల్లు పథకంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధ్యయనం పూర్తయిందని, అధికారులు మరో మూడు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న మేర ఇళ్లను అందిస్తామన్నారు. రాజీవ్‌ స్వగృహకు సంబంధించి కూడా వేలం వేసేందుకు కమిటీని నియమించామని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నామని వెల్లడించారు.

సామాన్యులకు ఇబ్బంది లేకుండా..

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రెవెన్యూ చట్టంలో సామాన్యులకు ఇబ్బందులు లేకుండా మార్పులు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇప్పటికే ధరణిలో చాలా మార్పులు చేశామని, మరికొన్ని మార్పులు చేయబోతున్నామని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ల విలువల సవరణలను కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణ అశాస్త్రీయంగా ఉందన్నారు. ఈ అంశంపై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తాము భూముల రిజిస్ట్రేషన్ల విలువలను సవరిస్తామని చెప్పారు.


అవసరమైతే తగ్గించాల్సిన చోట రిజిస్ట్రేషన్‌ విలువను తగ్గిస్తామని కూడా తెలిపారు. జీవో 59 కింద చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికి సంబంధించి దాదాపు రూ.32-33 కోట్ల నగదును త్వరలోనే వెనక్కి ఇస్తామన్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

రాష్ట్రంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయించే కంపెనీలను గుర్తించి, వాటి సీఎ్‌సఆర్‌ నిధులతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు కొత్త భవనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ఉండాలనే యోచనలో ఉన్నామన్నారు. తద్వారా గ్రామంలోని ప్రభుత్వ భూములు, ఇతర పథకాలపై క్షేత్రస్థాయి వివరాలన్నీ ప్రభుత్వానికి అందుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.6 లక్షల కోట్ల అప్పులకు వడ్డీతో కలిపి చెల్లిస్తున్నామని తెలిపారు.


Also Read:

స్కూల్‌కి వెళ్లి అదృశ్యమైన అమ్మాయిలు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

6 సెకెన్లలో ``6`` ఎక్కడుందో చూడండి..

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. కోర్టు ముందుకు నిందితులు?

For Mote Telangana News and Telugu News..

Updated Date - Jul 10 , 2024 | 10:10 AM

Advertising
Advertising
<