Ponguleti Srinivas Reddy: విపత్తుల నియంత్రణపై పదేళ్లుగా ప్రణాళికే లేదా?
ABN, Publish Date - Aug 30 , 2024 | 04:19 AM
రాష్ట్రం ఏర్పాటయ్యాక విపత్తుల నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఒక్కసారి కూడా చేపట్టలేదని, ఆ దిశగా ఒక్క సమావేశమూ నిర్వహించలేదని అధికారులు వివరించగా.. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి విస్మయం
హైదరాబాద్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఏర్పాటయ్యాక విపత్తుల నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఒక్కసారి కూడా చేపట్టలేదని, ఆ దిశగా ఒక్క సమావేశమూ నిర్వహించలేదని అధికారులు వివరించగా.. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం తొమ్మిది విభాగాల అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్, గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా, హైడ్రా పరిధిలో విపత్తుల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను కమిషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో 30 బృందాలు ఉండేవని ఇప్పుడు 70కు పెంచామని, సిబ్బంది సంఖ్యను 1,800 నుంచి 3,500 పెంచినట్లు తెలిపారు.
Updated Date - Aug 30 , 2024 | 04:19 AM