ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే హక్కులేదు: పొన్నం

ABN, Publish Date - May 11 , 2024 | 07:43 AM

పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని అమలుచేయని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రశ్నించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

హుస్నాబాద్‌, మే 10: పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని అమలుచేయని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రశ్నించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికల తర్వాత అన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. విభజన హామీలను అమలుచేయని బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కరీంనగర్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ 400సీట్లు అడుగుతోందని, బీజేపీ ఒక్క సీటు గెలవకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు హుస్నాబాద్‌లో మెడికల్‌ కాలేజీ హామీ ఏమైందంటున్నారని, అయితే మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హుస్నాబాద్‌ ప్రాంతాన్ని బలవంతంగా మీ ఆధిపత్యంలో ఉంచుకున్నారని, దీనిని బంధ విముక్తి చేస్తామన్నారు. కాగా ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియంతృత్వ విధానాలతో పదేళ్లలో ఒక్క హామీని అమలు చేయని బీజేపీని ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ కరీంనగర్‌ను కోహినూర్‌ కరీంనగర్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - May 11 , 2024 | 07:43 AM

Advertising
Advertising