ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Motkur: మధ్యాహ్న భోజనం ముద్దముద్ద

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:27 AM

హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.

  • తినలేక పడేసిన విద్యార్థులు

  • బియ్యంలోనే లోపం ఉందన్న హెచ్‌ఎం

  • యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జడ్పీ పాఠశాలలో ఘటన

మోత్కూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండారు. భోజనంలో ముద్దలు, ముద్దలుగా ఉన్న అన్నం వడ్డించడంతో తినడానికి వీలుకాక విద్యార్థులు పడేశారు. డబ్బులు ఉన్న కొందరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేయగా, మిగతా విద్యార్థులు కడుపు మాడ్చుకున్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు టి.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉన్న బియ్యంలో పురుగులు ఉండగా మంగళవారం వాటిని గోదాంకు పంపి, వేరే బియ్యం తెప్పించామన్నారు. ఆ బియ్యంతో వంట చేస్తే ముద్దలు, ముద్దలు అయిందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Updated Date - Nov 29 , 2024 | 03:27 AM