ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కరెంట్ బిల్లు కట్టలేరు.. ఎందుకంటే

ABN, Publish Date - Jul 01 , 2024 | 09:43 PM

రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి . కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులను కూడా ఆపేశాయి.

ఇక నుంచి TGSPDCL వెబ్ సైట్ లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని సంస్థ పేర్కొంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారాన్ని అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది. ఇకపై TGSPDC వినియోగదారులు తమ బిల్లులను విద్యుత్ శాఖ కార్యాలయంలో చెల్లించవచ్చు. 85 శాతానికి పైగా ఇంధన బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) ద్వారా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.


ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి బ్యాంకులు విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలివేశాయని టీజీఎస్పీడీసీఎల్ పేర్కొంది. వినియోగదారులు చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా UPIను కోరింది.


జులై 1 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)తో థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను రూట్ చేయడం ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు జారీ చేసిన క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్‌ఫారమ్‌లో ఉంటాయి. ఈ బ్యాంకుల కలిగిన కస్టమర్‌లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

For Latest News and National News click here

Updated Date - Jul 01 , 2024 | 09:45 PM

Advertising
Advertising