Ronald Ross: పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగాలి
ABN, Publish Date - Sep 14 , 2024 | 03:30 AM
నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున.. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టాలని జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు.
రెండో నంబర్ టర్బైన్‌కు మరమ్మతులు చేపట్టాలి
వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
సాగర్ సిబ్బందికి జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రాస్ ఆదేశం
నాగార్జునసాగర్ సెప్టెంబరు 13: నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున.. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టాలని జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తి వివరాలు, నీటి వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రంలో ఎనిమిది టర్బైన్లు ఉండగా, రెండో నంబర్ టర్బైన్‌కు ఏడాదిగా ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే నిపుణుల బృందాన్ని పిలిపించి మరమ్మతులు చేపట్టాలని, త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యుదుత్పత్తిలో ఎలాంటి సమస్యలు తలెత్తినా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హైడల్ డైరెక్టర్ వెంకటరాజన్, జెన్‌కో సీఈ మంగే్‌షకుమార్‌నాయక్, ఎస్‌ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, డీఈలు ప్రసన్నకుమార్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 03:30 AM