ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: సూర్యాపేట జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడి అరెస్టు

ABN, Publish Date - May 27 , 2024 | 03:21 AM

స్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోయేషన్‌ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్‌ చేశారు.

రూ.99 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి

తిరుమలగిరి, మే 26: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోయేషన్‌ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఏప్రిల్‌ 16న తిరుమలగిరి, నాగారం మండలాల్లోని ఇమ్మడి సోదరులకు చెందిన 2రైస్‌ మిల్లులపై అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, సివిల్‌ సప్లైస్‌ అధికారులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు.


ఈతనిఖీల్లో 2020- 21 సంవత్సరానికి సంబంధించి తిరుమలగిరిలోని సంతోష్‌ రైస్‌మిల్లు నుంచి రూ.91.31కోట్ల విలువైన 41,365టన్నుల ధాన్యం, నాగారం మండలంలోని ప్రగతి నగర్‌ మిల్లు నుంచి రూ.7.71కోట్ల విలువైన 3,500 టన్నుల ధాన్యం బకాయి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి చేయకుండా పక్కదారి పట్టించారని సివిల్‌ సప్లైస్‌ అధికారులు మిల్లు యజమానులైన ఇమ్మడి సోదరులపై ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమ నర్సయ్య, సోమయ్యను ఆదివారం రాత్రి సూర్యాపేటలో అరెస్ట్‌ చేసి జిల్లా మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

Updated Date - May 27 , 2024 | 03:21 AM

Advertising
Advertising