Hyderabad: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొ. బాలకిష్టారెడ్డి
ABN, Publish Date - Oct 17 , 2024 | 03:36 AM
రాష్ట్ర ఉన్నత విద్యామం డలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పురుషోత్తంలను ప్రభుత్వం నియమించింది.
వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పురుషోత్తం
మహిళా వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా దనావత్ సూర్య
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా గోవర్ధన్
నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
ప్రపంచంతో పోటీ పడేలా ఉన్నత విద్యలో
సంస్కరణలు, సిలబస్‌లో మార్పులు: బాలకిష్టారెడ్డి
హైదరాబాద్/తాడూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యామం డలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పురుషోత్తంలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు మహిళా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా దనావత్ సూర్య, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్‌లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి వ్యవహరించారు. బాలకిష్టారెడ్డి నియామకంతో బుధవారం సాయం త్రం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. గురువారం మధ్యాహ్నం బాలకిష్టారెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. బాలకిష్టారెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం పర్వతాయిపల్లి.
గ్రామానికి చెందిన రాంరెడ్డి, ముత్యాలమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఐదు మంది కూతుళ్లు కాగా.. వారిలో బాలకిష్టారెడ్డి చివరి సంతానం. ఆయన పాఠశాల విద్య పూర్తిగా కుమ్మెర గ్రామంలోనే సాగింది. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ప్రస్తుతం మహీంద్ర వర్సిటీలో లా స్కూల్ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో నల్సార్ లా యూనివర్సిటీలో వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్‌లాలో బాలకిష్టారెడ్డికి మూడు దశాబ్దాలకు పైగా బోధన, పరిశోధన, పరిపాలన అనుభవం ఉంది. మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులైన పురుషోత్తం ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ వీసీగా నియమితులైన గోవర్ధన్ ప్రస్తు తం జేఎన్‌టీయూలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మహిళా వర్సిటీ వీసీగా నియమితులైన దనావత్ సూర్య ఓయూలో తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు వీసీల ఎంపికపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కాగా, మహి ళా వర్సిటీ, బాసర ట్రిపుల్ ఐటీల వీసీల నియామకానికి గవర్నర్ ఆమోదం అవసరం లేకపోవడంతో తాజా నియామకాలు జరిగాయి. వీసీలకు సంబంధించిన కోర్టు కేసు నేపథ్యంలో వీరిని ఇన్‌చార్జ్ వీసీలుగా వ్యవహరిస్తున్నారని, కానీ వీరే నిర్ణీత పదవీకా లం వరకు వీసీలుగా కొనసాగుతారని తెలుస్తోంది. మిగతా పది వర్సిటీలకు మాత్రం సెర్చ్ కమిటీల ఆధారంగానే వీసీలను నియమిస్తారు.
సిలబస్‌లో మార్పులు: బాలకిష్టారెడ్డి
విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఉన్నత విద్యలో మార్పులు తీసుకురానున్నట్టు మండలి కొత్త చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ప్రపంచంలో వస్తు న్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఈ మేరకు సిలబ్‌స లో మార్పులు చేస్తామని తెలిపారు. ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలను తీసుకువస్తామన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 03:37 AM