ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: గాయత్రి యజ్ఞంకు అనుమతించాలని ఆందోళన

ABN, Publish Date - Dec 17 , 2024 | 06:20 AM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో హనుమత్‌ గాయత్రి యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ హనుమాన్‌, అయ్యప్ప మాలధారులు సోమవారం ఆందోళన నిర్వహించారు.

  • రోడ్డుపై భిక్ష చేసి మాలధారుల నిరసన

  • నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఘటన

నార్కట్‌పల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో హనుమత్‌ గాయత్రి యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ హనుమాన్‌, అయ్యప్ప మాలధారులు సోమవారం ఆందోళన నిర్వహించారు. నార్కట్‌పల్లి స్టాండ్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపైనే మాలధారులు మధ్యాహ్నం భిక్ష చేశారు. నార్కట్‌పల్లిలో మసీదు ఎదురుగా ఉన్న అంగడి స్థలంలో ఈ నెల 17న యజ్ఞం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. ఆ స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తుండటంతో పోలీసులు అనుమతి నిరాకరించారు.


చివరకు యజ్ఞం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీల వద్ద చర్చించిన తర్వాత నిర్వహించుకోవాలని చేసిన సూచనను మన్నిస్తూ మంగళవారం జరగాల్సిన యజ్ఞాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. బీజేపీ, నార్కట్‌పల్లి పరిరక్షణ సమితి, హైందవ సంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు నార్కట్‌పల్లి మసీదులో నమాజ్‌ జరుగుతున్న సమయంలో కొందరు రాళ్లు రువ్వి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎంబీటీ(మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌) నేత అహ్మదుల్లాఖాన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసిన వీడియోను తొలగించాలని కోరుతూ ఆ సంస్థకు లేఖ రాసినట్లు నార్కట్‌పల్లి సీఐ నాగరాజు తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 06:21 AM