Exam Postponement: డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ ఆందోళన..
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:32 AM
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు బుధవారం కూడా ఓయూలో ఆందోళన కొనసాగించారు.
ఓయూలోపలువురి అరెస్టు..ఖండించిన కేటీఆర్, హరీశ్
తార్నాక/హైదరాబాద్, జూలై 10(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు బుధవారం కూడా ఓయూలో ఆందోళన కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన బీఆర్‌ఎస్వీ నాయకులను పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఓ న్యూస్ చానల్ విలేకరిపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్టు చేశారు. దీంతో పలు విద్యార్థి సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు ఓయూ పోలీ్‌సస్టేషన్ ముందు బైఠాయించారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ కోదండరాం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్(టీఎస్పీ) నాయకులను పోలీసులు ఓయూలో ముందుస్తుగా అరెస్టు చేశారు. కాగా, ప్రజా పాలనలో జర్నలిస్టులకు రక్షణ లేదా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పోలీసుల తీరు స్వేచ్ఛను కాలరాయడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. కోచింగ్ సెంటర్ల లాభాల కోసమే డీఎస్సీ రద్దుకు డిమాండ్ చేస్తున్నారంటూ నిరుద్యోగులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కుమార్ ఆరోపించారు. గత, ప్రస్తుత పాలకులు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు.
Updated Date - Jul 11 , 2024 | 04:32 AM