R. Krishnaiah: బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి
ABN, Publish Date - Nov 04 , 2024 | 04:19 AM
తెలంగాణలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
అద్దె భవనాల్లో విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు: ఆర్.కృష్ణయ్య
మెస్ చార్జీల పెంపుపై విద్యార్థుల సంబరాలు
రాంనగర్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కనీస వసతులు లేని అద్దె భవనాలలోని హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో వారు చదువుకోలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాల మెస్‌చార్జీలు పెంచినందుకు ఆదివారం నగరంలోని పలు కాలేజీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీగా విద్యానగర్‌లోని బీసీ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ కాలేజీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు ఒక్కదానికీ సొంత భవనాలు లేవని పేర్కొన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 04:19 AM