ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ranganath: కాలువ జోలికొస్తే ఎఫ్‌ఐఆర్‌..

ABN, Publish Date - Aug 14 , 2024 | 10:37 AM

‘ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తీసిన కాలువను ఎవరైనా పూడ్చినా, టచ్‌ చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి.’ అని అధికారులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశించారు.

- హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

- హయత్‌నగర్‌ హత్తిగూడ చెరువు సందర్శన

హైదరాబాద్: ‘ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తీసిన కాలువను ఎవరైనా పూడ్చినా, టచ్‌ చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి.’ అని అధికారులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశించారు. హయత్‌నగర్‌ బొమ్మగుడి రోడ్డులో ఉన్న హత్తిగూడ చెరువును ఆయన మంగళవారం సందర్శించారు. చెరువులోకి వర్షం నీరు వచ్చే ప్రాంతాన్ని పరిశీలించారు. నీరు రాకుండా కల్వర్టును ఎవరు పూడ్చారో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్‌ చేసి ఎవరు విక్రయించారో తెలుసుకోవాలన్నారు. పాత నక్షా, రికార్డుల ప్రకారం చెరువు ఎఫ్‏టీఎల్‌, బఫర్‌ జోన్‌ ఎంత ఉందో పరిశీలిస్తామన్నారు. ఆక్రమణదారులను గుర్తించి కేసులు పెడతామన్నారు. ‘నీరు చెరువులోనికి వెళ్లకుండా కల్వర్టుకు అడ్డంగా మట్టి పోసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నాకు చెప్పాలి’ అని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో హెచ్‌ఎండీఏ, లేక్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: Cyberabad CP: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..


లే అవుట్‌ను మార్చారు..

- కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్‌

చెరువు అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌ మండలాల పరిధిలో ఉందని కార్పొరేటర్‌ నరసింహరెడ్డి(Corporator Narasimhar Reddy) కమిషనర్‌కు తెలిపారు. ఇద్దరు అధికారులు చెరువు ఆక్రమణ విషయంలో పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు చేసిన రెండు వేర్వేరు సర్వే రిపోర్టులను ఆయన కమిషనర్‌కు అందజేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన భవనాలను కమిషనర్‌కు చూపించారు. పాత రికార్డుల ఆధారంగా రెండు సర్వే రిపోర్టులనూ పరిశీలించాలని డీఈఈ ఉషారాణిని కమిషనర్‌ ఆదేశించారు.


259 పోస్టుల మంజూరు

హైదరాబాద్‌లో నాలాలు, చెరువుల ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రాకు (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) 259 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాల్లో సేవలను మరింత విస్తృత పరిచేందుకు ఐపీఎస్‌ నుంచి హోంగార్డు వరకు వివిధ పోస్టులను మంజూరు చేశారు.


పోస్టులు ఇలా..

ఐపీఎస్‌ ఎస్పీ-1, నాన్‌ క్యాడర్‌ ఎస్పీ-3, డీఎస్పీ-5, ఇన్‌స్పెక్టర్‌లు-21, ఎస్‌ఐ-33, ఆర్‌ఐ-5, ఆర్‌ఎస్‌ఐ-12, కానిస్టేబుల్స్‌-101, హోంగార్డులు-72, అనలిటికల్‌ ఆఫీసర్‌-3, అసిస్టెంట్‌ అనలిటికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 3 ఉన్నాయి. ఆయా పోస్టులను వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌ ద్వారా భర్తీ చేసుకోవ డానికి మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఆదేశాలు జారీ చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 10:37 AM

Advertising
Advertising
<