ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏకంగా కలెక్టర్‌పైనే చేయి చేసుకున్న మహిళా రైతు.. ఎక్కడంటే

ABN, Publish Date - Nov 11 , 2024 | 03:12 PM

Telangana: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Vikarabad Collector

వికారాబాద్, నవంబర్ 11: జిల్లాలోని లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై మహిళా రైతు చేయిచేసుకుంది. వెనుక నుంచి కలెక్టర్ భుజంపై కొట్టడం కలకలం రేపింది. ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్, అధికారుల కార్లపై రాళ్లు రువ్వారు. రైతుల దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.

AP Budget: రైతులకు శుభవార్త.. ఆ రోజు మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి..



వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు యత్నించారు. అయితే గ్రామానికి దూరంగా ఉండటం వల్ల రైతులు, గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఓ మహిళ.. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనుక నుంచి వచ్చి భుజంపై కొట్టింది. దీంతో ఆయన ముందకు తూలారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్థులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తమ ఆందోళనను తీవ్ర తరం చేశారు. అధికారులకు సంబంధించిన మూడు కార్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా కలెక్టర్‌ను గ్రామస్థుల బారి నుంచి రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది.


వికారాబాద్‌లో ఫార్మా సెజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఫార్మా సెజ్ ఏర్పాటుతో తమ భూముల సారం కోల్పోతాయని.. అలాగే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల భూసారం పోతుందని, పంటలు తీవ్రంగా నష్టపోతాయని, తమ జీవనాధారం కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరిగితే భూములతో పాటు సర్వం కోల్పోతామేమో అన్న భయం రైతుల్లో ఉంది. అయితే ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈరోజు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు అధికారులు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

AP Budget 2024: బడ్జెట్‌కు ముందు పయ్యావులకు సీఎం ఏం చెప్పారో తెలుసా

Hardik Pandya: కావాలనే స్లోగా ఆడిన హార్దిక్.. ఇంత స్వార్థం దేనికి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 03:12 PM