Biryani: బిర్యానీలో వచ్చింది తినుంటే గొంతు తెగేదే..
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:20 PM
Telangana: మేడ్చల్ జిల్లా ఘట్నేసర్‌లోని ఆదర్శ్ రెస్టారెంట్‌లో నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు చేదు అనుభవమే ఎదురైంది.
మేడ్చల్, డిసెంబర్ 23: హైదరాబాద్ బిర్యానీలో (Hyderabad biryani) హానీకరమైన కలర్స్ వాడుతూ కల్తీ చేస్తుండటంతో పాటు.. బిర్యానీ తయారీలో నిర్లక్ష్యంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతినే పరిస్థితికి తీసుకువచ్చారుహోటల్ నిర్వాహకులు. అయినప్పటికీ బిర్యానీ తయారీ విషయంలో వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇందుకు మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ అంటే మెచ్చనివారు ఉండరు. ఎన్ని ఆహారపదార్ధాలు ఉన్నా హైదరాబాద్ బిర్యానీ ఉందంటే చాలు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బిర్యానీ అంటేనే చాలు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Kollu Ravindra: అలా చేశారంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా.. నానిపై కొల్లురవీంద్ర ఫైర్
ఎందుకంటే.. బిర్యానీలో బయటపడుతున్న పదార్థాలే అందుకు కారణం. బిర్యానీలో చికెన్ పీసులకు బదులుగా సిగెరెట్ పీకలు, బొద్దింకలు బయటపడుతుండంతో బిర్యానీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నోసార్లు తనిఖీలు చేసినా.. రెస్టారెంట్లను సీజ్ చేసినప్పటికీ వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తయారీలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రానురాను హైదరాబాద్ బిర్యానీ అంటేనే వామ్మో అనే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా మేడ్చల్‌లో బిర్యానీని ఆర్డర్ చేసిన కస్టమర్లకు అందులో కనిపించిన వస్తువును చూసి అవాక్కయ్యారు.
పార్శిల్ డెడ్ బాడీ కేసులో ఇదే ట్విస్ట్..
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఆదర్శ్ రెస్టారెంట్‌లో నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కొందరు కస్టమర్లు బిర్యానీని తినేందుకు ఘట్‌కేసర్ ఆదర్శ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చారు. ఆ తరువాత కొద్దినిమిషాలకు వేడివేడి బిర్యానీని వారి టేబుల్ దగ్గరకు తీసుకొచ్చారు హోటల్ నిర్వాహకులు. దీంతో బిర్యానీని ఓ పట్టుబడదామని భావించిన ఆ కస్టమర్లకు చేదు అనుభవమే ఎదురైంది. బిర్యానీ తింటుండగా కస్టమర్‌లో అందులో ఏదో అనుమానంగా కనిపించింది. బిర్యానీలో చికెన్ పీసులకు బదులుగా బ్లేడ్ ముక్క ప్రత్యక్షమైంది.
వెంటనే దాన్ని చూసిన కస్టమర్ అవాక్కయ్యాడు. బిర్యానీలో చికెన్ పీసులకు బదులుగా బ్లేడ్ ముక్కలు ప్రత్యక్షమవడంతో కస్టమర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటంటూ రెస్టారెంట్ సిబ్బందిని కస్టమర్ ప్రశ్నించాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బ్లేడ్ తీసేసి బిర్యానీ తినండి అంటూ రెస్టారెంట్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్.. రెస్టారెంట్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఆపై బిర్యానీలో బ్లేడ్ ప్రత్యక్షమవడంపై మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ ఫిర్యాదు చేశారు. ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని వస్తే ఇలా జరిగిందని.. రెస్టారెంట్ సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి...
నోటీసులకు స్పందించిన పేర్ని నాని కుటుంబం..
గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 23 , 2024 | 12:28 PM