ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

ABN, Publish Date - Sep 09 , 2024 | 11:28 AM

Telangana: జిల్లాలోని వట్టినాగులపల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి నిన్న (ఆదివారం) కనిపించకుండాపోయాడు. అయితే నిన్న అదృశ్యమైన విద్యార్థి శ్రీనివాస్ శవమై కనిపించాడు. నీళ్లు నిలువ చేసిన‌ నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం చెందాడు.

A boy died after falling into a well

రంగారెడ్డి, సెప్టెంబర్ 9: జిల్లాలోని వట్టినాగులపల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి నిన్న (ఆదివారం) కనిపించకుండాపోయాడు. అయితే నిన్న అదృశ్యమైన విద్యార్థి శ్రీనివాస్ శవమై కనిపించాడు. నీళ్లు నిలువ చేసిన‌ నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం చెందాడు. నిన్న మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి... ‌ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడ్డాడు. అయితే ‌ఈత రాకపోవడంతో గుంటలో మునిగి పోయి చిన్నారి ప్రాణాలు విడిచాడు.

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు



మధ్యాహ్నం నుంచి శ్రీనివాస్ కనిపించక పోవడంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల అంతా వెతికారు. ఎంత వెతికినా బాలుడి జాడ లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈరోజు ఉదయం నీటి కోసం తొవ్విన భారీ గుంటలో బాలుడి శవం లభ్యమైంది. బాలుడి శవం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆడుకోడానికి వెళ్లిన తమ చిన్నారి ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Rain News: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. ఆదివాసీల గృహాలపై విరిగిపడ్డ కొండ చరియలు


అయితే వట్టినాగుపల్లిలో గత కొంత కాలంగా మాఫియా నీటి దందా చేస్తోంది. నీళ్లను ట్యాంకర్ల ద్వారా అమ్మి మాఫియా సొమ్ము చేసుకుంటోంది. యజమానులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండానే నీటి దందాకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా కేటుగాళ్లు నీళ్లను అమ్ముకుంటున్న పరిస్థితి. గత నెల నీటి గుంటలను రెవెన్యూ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. అయినప్పటికీ అక్రమంగా నీటు దందా కొనసాగించారు సదరు కేటుగాళ్లు. చివరకు వారి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నారు. అక్రమ నీటి దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి...

AP News: బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..

TG Highcourt: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు తీర్పు

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 09 , 2024 | 11:30 AM

Advertising
Advertising