Actor Ali: సినీ నటుడు అలీకి నోటీసులు
ABN, Publish Date - Nov 24 , 2024 | 11:24 AM
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా: సినీ నటుడు అలీకి (Tolly Wood Actor Ali) అధికారులు నోటీసులు (Notices) ఇచ్చారు. వికారాబాద్ జిల్లా (Vikarabad Dist.), నవాబు పేట్ మండలం, ఎక్ మామిడి గ్రామపంచాయతీ పరిధిలో అలీ ఫామ్ హౌస్ (Farm House) ఉంది. ఆ ఫామ్ హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఫిర్యాదు అందింది. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో గ్రామ సెక్రెటరీ శోభారాణి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఈ నెల 22న మరోసారి నోటీసు అందజేశారు. నోటీసు ఇచ్చే సమయంలో ఆలీ లేకపోవడంతో ఆ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి నోటీసు అందించామని శోభారాణి చెప్పారు.
కాగా పంచాయతీ గ్రామ సెక్రెటరీ శోభారాణి ఇచ్చిన నోటీసుపై తన తరఫు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు నటుడు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - Nov 24 , 2024 | 01:07 PM