Attack on Collector: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:33 PM
Telangana: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్‌గా పోలీసులు కనిపెట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నాడు.
వికారాబాద్, నవంబర్ 12: వికారాబాద్ కలెక్టర్‌పై (Attack on Vikarabad Collector) దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్‌గా పోలీసులు కనిపెట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నాడు. దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్‌తో (BRS Working President KTR) ఫోన్లో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయి. చెల్లెలి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు అతడిపై రేప్ కేసు నమోదు అయ్యింది. సురేష్‌పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
Bhanuprakash: అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై భానుప్రకాష్ సంచలన కామెంట్స్
కాగా.. వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై స్థానిక ప్రజలు దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాదు కలెక్టర్, అధికారులకు సంబంధించిన మూడు కార్లను ప్రజలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో గ్రామంలో తీవ్ర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించాగా.. అందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీంతో కలెక్టర్, రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది.
కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ వెనుక నుంచి కలెక్టర్ భుజంపై చేయిచేసుకోవడంతో ఆయన ముందుకు తూలారు. ఇదే అదునుగా భావించిన అక్కడి ప్రజలు కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. గ్రామస్థులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తమ ఆందోళనను తీవ్ర తరం చేశారు. అధికారులకు సంబంధించిన మూడు కార్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా కలెక్టర్‌ను గ్రామస్థుల బారి నుంచి రక్షించారు. అయితే కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
నోట్: ఈ వార్తలోని అంశాలు కేవలం పోలీసుల విచారణలో వెల్లడైనట్లు మీడియాకు అందిన సమాచారం మాత్రమే. ఈ వార్తకు ఆంధ్రజ్యోతికి ఎటువంటి సంబంధం లేదు.
ఇవి కూడా చదవండి..
AP NEWS: వేట మొదలైంది.. సోషల్ మీడియా సైకోల భరతం పడుతున్న పోలీసులు
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 01:29 PM