ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rathod Ramesh: ఆదిలాబాద్‌లో లంబాడా బంజారాలకు ఎంపీ టికెట్ ఇవ్వాలి

ABN, Publish Date - Mar 11 , 2024 | 06:26 PM

ఆదిలాబాద్‌లో లంబాడా బంజారాలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తామని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod ) అన్నారు. మాజీ ఎంపీ నగేష్ బీజేపీలో చేరిక, లోక్ సభ స్థానాన్ని ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై సోమవారం నాడు బీజేపీ (BJP) నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ లక్ష్మణ్‌ని ఆదిలాబాద్ నేతలు కలిశారు.

ఢిల్లీ: ఆదిలాబాద్‌లో లంబాడా బంజారాలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలుస్తామని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod ) అన్నారు. మాజీ ఎంపీ నగేష్ బీజేపీలో చేరిక, లోక్ సభ స్థానాన్ని ఆయనకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై సోమవారం నాడు బీజేపీ (BJP) నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ లక్ష్మణ్‌ని ఆదిలాబాద్ నేతలు కలిశారు. జిల్లాలో ఉన్న పరిస్థితులను బంజారా నేతలు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హై కమాండ్‌కు వివరించారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ....చాలా మంది నేతలు మోదీ పాలనను చూసి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరామని చెప్పారు.

పార్టీలో చేరే వారిని అడ్డుకోబోమని చెప్పారు. పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 8 శాతం మంది లంబాడా బంజారాలు ఉన్నారని వివరించారు. గోండు, బంజారాలు, గిరిజన జాతులు మొత్తం 3.5 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు. లంబాడా బంజారా ఓట్లు లక్షన్నర వరకు ఉన్నాయన్నారు. మా జనాభాను దృష్టిలో ఉంచుకుని టికెట్లు కేటాయించాలని కోరారు. తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఆదివాసీ జనాభా కన్నా లంబాడా బంజారా జనాభా ఎక్కువ ఉందని చెప్పారు. నగేష్‌కి టికెట్ ఇవ్వొద్దని పార్టీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటారు కాని ..సీటు ఇవ్వొద్దని చెప్పారు. పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని రమేష్ రాథోడ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

CM Revanth: ఇల్లాలి ముఖంలో సంతోషం చూసేందుకే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’...

V. Hanumantha Rao: కేంద్రం ఓబీసీల రిజర్వేషన్ పెంచాలి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 07:56 PM

Advertising
Advertising